భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

సిహెచ్

గురువారం, 19 డిశెంబరు 2024 (18:34 IST)
భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ (Pancreatic Cancer) కేసులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం వుంది. దురదృష్టవశాత్తూ, చాలా మంది రోగులు క్యాన్సర్ తీవ్రమైన దశల్లో మాత్రమే రోగనిర్ధారణను వస్తున్నారు, దీని వలన చికిత్స మరింత సవాలుగా మారుతుంది. మనుగడ రేటు తక్కువగా ఉంటుంది.
 
"మనం చూసే దాదాపు 80% ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు క్యాన్సర్ తీవ్ర దశలో నిర్ధారణ అవుతున్నాయి" అని డాక్టర్ డాక్టర్ పిఎస్ దత్తాత్రేయ చెప్పారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ యొక్క ప్రాథమిక సవాళ్లలో ఒకటి దాని "నిశ్శబ్ద" స్వభావం. ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, ఇది చాలా అరుదుగా స్పష్టమైన ప్రారంభ లక్షణాలతో ఉంటుంది. సాధారణ సమస్యలుగా సులభంగా పొరబడే అవకాశాలు ఉన్నాయి. పొత్తికడుపులో అసౌకర్యం లేదా వెన్నునొప్పి వంటి సంకేతాలు తేలికపాటివిగా కనిపించవచ్చు, తరచుగా విస్మరించబడతాయి.
 
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సూచించే కొన్ని లక్షణాలలో నిరంతర పొత్తికడుపు లేదా వెన్నునొప్పి, వివరించలేని కారణాల చేత బరువు తగ్గడం, చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం, ఆకలి లేకపోవడం, ముఖ్యంగా భోజనం తర్వాత వికారం వంటివి ఉంటాయి. ఈ లక్షణాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు మాత్రమే ప్రత్యేకమైనవి కానప్పటికీ, డాక్టరును సంప్రదించటం అవసరం.
 
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. అత్యంత సాధారణ రూపం, అడెనోకార్సినోమా. ఇది ప్యాంక్రియాటిక్ నాళాలలో ప్రారంభమవుతుంది, దాదాపు 95% కేసులు ఇవే ఉంటాయి. మరొకటి, న్యూరోఎండోక్రిన్. ఇవి చాలా అరుదుగా ఉంటాయి. వీటికి వేర్వేరు చికిత్సా విధానాలు అవసరం అయినప్పటికీ, ముందుగా గుర్తించడం రెండింటికీ కీలకం.
 
"ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం గురించి చురుకుగా ఉండాలని మేము కోరుతున్నాము. లక్షణాలు కొనసాగితే, వైద్య సలహా తీసుకోవడానికి సంకోచించకండి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం సవాలుగా ఉన్నప్పటికీ, దాని లక్షణాల గురించి అవగాహన పెంచుకోవడం మరియు ముందస్తు రోగ నిర్ధారణలు వల్ల మెరుగైన  ఫలితాలు వస్తాయి.
- డాక్టర్ పి ఎస్ దత్తాత్రేయ (MD, DM, DNB) మెడికల్ ఆంకాలజిస్ట్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు