సోనియాతో రోశయ్య రహస్య మంతనాలు: ఆంతర్యం..?

ముఖ్యమంత్రి రోశయ్య పార్టీ అధినేత్రితో సుమారు అరగంటపాటు రహస్య మంతనాలు సాగించారు. చర్చల వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

సాక్షి కథనాల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చర్య తీసుకునేందుకే ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారని కొందరంటుంటే, తన పదవిని వదులుకునే విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఆయన వచ్చారంటూ హస్తినలో ఊహాగానాలు తిరుగాడుతున్నాయి.

మరోవైపు రోశయ్య ఢిల్లీ నుంచి రేపు రావలసి ఉన్నప్పటికీ తన పర్యటనను అర్థంతరంగా ముగించుకుని ఈ సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు పయనమవుతున్నారు. కోర్ కమిటీకి చెందిన అగ్ర నాయకులతో రోశయ్య సమావేశమవుతుండటంతో రాష్ట్రంలో ఏదో కీలకమైన కుదుపు ఉండబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి. అసలు సంగతి ఏమటనే విషయం తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి