ఆ ఇద్దరికీ డిప్యూటీ సీఎంకి బదులు మంత్రి పోస్టులు

ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో పోటీపడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన జె.గీతారెడ్డి, దామోదర రాజనర్శింహలకు ఆ పదవి దక్కలేదు. వీరిద్దరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి కేటాయిస్తారనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

దళిత వర్గానికి చెందిన గీతారెడ్డి, దామోదర రాజనర్శింహలు డిప్యూటీ సీఎంకు గట్టిగా కృషి చేశారు. వీరిద్దరికి అధిష్టానం వద్ద మంచి పేరు ఉండటమే కాకుండా, తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఖచ్చితంగా వీరిద్దరిలో ఎవరికో ఒకరిని డిప్యూటీ సీఎం వరిస్తుందని అందరూ భావించారు. అయితే, వీరిద్దరికి మంత్రివర్గంలోనే చోటు కల్పించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి