వైఎస్ జగన్ కొత్తపార్టీలోకి రాజకీయ నిరుద్యోగుల క్యూ

వైఎస్ స్థాపించబోయే వైఎస్సార్ రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీలో ఇడలేక, ఇటు తెలుగుదేశం పార్టీలో ఉండలేక కొన్నాళ్లుగా రాజకీయ సన్యాసం చేస్తున్న నాయకులు ఇపుడు వైఎస్ జగన్ పార్టీలో ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

2009 ఎన్నికలకు ముందు పుట్టుక వచ్చిన ప్రజారాజ్యం పార్టీలోనూ ఇటువంటి వలసలే జరిగాయి. అప్పట్లో హరిరామజోగయ్య వంటి నేతలు పీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మెగా పార్టీ ఎన్నికల్లో బోల్తా కొట్టేసరికి ప్లేటు ఫిరాయించారు.

ఇపుడు వైఎస్సార్ తనయుడు జగన్ స్థాపించబోతున్న పార్టీలోకి కూడా మేము చేరుతామంటే... మేము చేరతామని పరుగులెత్తుతున్నారు ఈ నాయకులు. మరి వీరి రాకతో జగన్ పార్టీ బలపేతమవుతుందో... బలహీనమవుతుందో కాలమే సమాధానం చెపుతుంది.

వెబ్దునియా పై చదవండి