లక్ష్యదీక్ష ఎఫెక్ట్: జగన్మోహన్ వర్గంలోకి మరో ఎమ్మెల్యే!!

శుక్రవారం, 24 డిశెంబరు 2010 (12:27 IST)
రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 48 గంటల లక్ష్యదీక్ష ఎఫెక్ట్ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులపై బాగానే ప్రభావితం చూపినట్టుగా తెలుస్తోంది. పలు ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు, నేతలు జగన్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇందులోభాగంగా విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే మళ్ల దుర్గాప్రసాద్ జగన్‌కు జైకొట్టేందుకు సిద్ధమయ్యారు. తన నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు కోరితే ఖచ్చితంగా జగన్‌తో చేతులు కలుపుతానని ప్రకటించారు.

అయితే, వచ్చే నెలలో విశాఖపట్నంలో జగన్ చేపట్టే ఓదార్పు యాత్రా సమయంలో విజయప్రసాద్ తన నిర్ణయాన్ని ప్రకటించించే అవకాశాలు ఉన్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజలకందించిన సంక్షేమ కార్యాక్రమాలకు ఆకర్షితుడనై కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు చెప్పారు.

ఆయనంటే తనకు ఎనలేని అభిమానమన్నారు. తనను గుర్తించి కాంగ్రెస్‌ పార్టీకి సేవలు వైఎస్ ప్రోత్సహించడం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నట్టు చెప్పారు. ఇకపోతే.. తన రాజీనామా విషయాన్ని జగన్ ఓదార్పు యాత్రకు ముందుగానే మీడియాకు వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి