రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే ఒప్పుకుంటా.. కానీ...
శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయాలని తన నివేదికలో వెల్లడిస్తే దానికి తను అంగీకరిస్తానని ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. అయితే ఇదే సూత్రాన్ని దేశంలో మిగిలిన రాష్ట్రాలకు కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నిజానికి తెలంగాణాలోని అత్యధిక శాతం ప్రజలు రాష్ట్రం ముక్కలు కావాలని కోరుకోవడం లేదనీ, వెనుకబాటుతనాన్ని తరిమికొట్టాలని మాత్రమే కోరుకుంటున్నారని కావూరి చెప్పుకొచ్చారు.
ఇక రైతులకోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్ష, మొన్న లక్ష్యదీక్షతో పేరుతో వైఎస్ జగన్ చేసిన దీక్ష రెండూ శుద్ధ దండగేననీ, అటువంటి దీక్షలతో ఒరిగేదేమీ ఉండదన్నారు. రైతులకు సాయం చేయడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని కితాబిచ్చారు.