ఓయూలో మళ్లీ ఉద్రిక్తత: పరీక్షా కేంద్రాల వద్ద బైఠాయింపు!!

సోమవారం, 27 డిశెంబరు 2010 (13:17 IST)
ఉద్యమాల ఖిల్లా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంసీఏ, ఎంఈడీ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే, పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని వర్శిటీ ఉపకులపతి తిరుపతిరావు తేల్చి చెప్పారు.

దీంతో విద్యార్థులు సామూహికంగా పరీక్షలను బహిష్కరించారు. విద్యార్థులకు ఉస్మానియా వర్శిటీ జేఏసీ మద్దతు తెలిపింది. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్, కోఠీ కళాశాలతో పాటు ఓయూలోని రెండు పరీక్ష కేంద్రాలకు కూడా విద్యార్థులు హాజరు కాలేదు. కాగా ముందు జాగ్రత్త చర్యగా ఉస్మానియాలో పోలీసులు భారీగా మోహరించారు.

అంతకుముందు వీసీ తిరుపతిరావు మాట్లాడుతూ సోమవారం నుంచి ఉస్మానియా వర్శిటీ పరిధిలో జరిగే ఎంసీఏ, ఎంఈడీ పరీక్షలను యధావిధిగా నిర్వహిస్తాని రెండు రోజుల క్రితమే ప్రకటించారు. అదేవిధంగా సోమవారం పరీక్షలను నిర్వహించారు. అయితే, పరీక్షలను అడ్డుకుంటామని ఓయూ జేఏసీ పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా పరీక్షా కేంద్రాల వద్ద భారీగా సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.

వెబ్దునియా పై చదవండి