ఒకవైపు తెరాస, భాజపా ఢిల్లీలో జరుగనున్న అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం సమావేశానికి హాజరయ్యేందుకు పంపాల్సిన ప్రతినిధుల ఎంపిక పనిలో పడింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.... ఈ నెల ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున కావూరి సాంబశివరావు, ఉత్తమ కుమార్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం మరోసారి దొంగాట ఆడుతోందని ఇప్పటికే తెలంగాణా ప్రాంత తెలుగుదేశం నాయకులు ధ్వజమెత్తారు.