రాష్ట్రంలో భారీ బందోబస్తు: పరిస్థితిని సమీక్షిస్తున్న డీజీపీ

గురువారం, 6 జనవరి 2011 (10:49 IST)
రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. డీజీపీ అరవింద రావు అన్ని జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక గురువారం బహిర్గతం కానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ తరహా చర్యలు చేపట్టినట్టు డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించినట్లు ఆయన తెలిపారు.

ఇకపోతే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే 18 కంపెనీల బలగాలను మొహరించినట్టు సిటీ కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. ఆందోళనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, నివేదికలపై అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలను ఎలక్ట్రానికి మీడియా ప్రసారం చేయరాదని హెచ్చరించారు.

ఎన్.బి.ఏ ఆంక్షలను ఉల్లంఘించి ప్రసారం చేసే ఛానళ్ళపై చర్యలు తీసుకుంటామని ఆనయ తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు విధిగా ఎన్‌బీఏ మార్గదర్శకాలను పాటించి సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి