బుద్ధుడి ప్రవచనంతో జస్టీస్ శ్రీకృష్ణ నివేదిక తయారు!!

గురువారం, 6 జనవరి 2011 (12:24 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైంది. ఈ నివేదికను 1960 సంవత్సరం అక్టోబరు మూడో తేదీన ఐక్యరాజ్యసమితిలో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంలో ఉటంకించిన బుద్ధుని ప్రవచనాలతో నివేదికను రెండు సంపుటాలలో రూపొందించారు. మొత్తం 505 పేజీలతో కూడిన తొలి సంపుటిలో మొత్తం తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కో అధ్యాయంలో ఒక్కో అంశాన్ని విపులీకరించారు. రెండో సంపుటి 108 పేజీలతో ఉంది. ఇందులో మరికొన్ని అంశాలను విపులీకరించారు.

శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న తొమ్మిది అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో రాష్ట్రంలో పరిణామాలు, చారిత్రక దృక్ఫథం వంటి అంశాలను వివరించారు. అలాగే, అధ్యాయం-2లో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, సమతుల్యత విశ్లేషణను విశ్లేషించారు. అధ్యాయం-3లో విద్య - వైద్యం రంగాలను వివరించగా, అధ్యాయం-4లో నీటి వనరులు, సాగునీటి, విద్యుత్ అభివృద్ధి అంశాలను పేర్కొన్నారు.

ఇకపోతే.. ఐదో అధ్యాయంలో ప్రజలు- ఉద్యోగ అంశాలు, అద్యాయం ఆరులో హైదరాబాద్ మహానగరం, ఏడో అధ్యాయంలో సామాజిక సాంస్కృతిక అంశాలు, ఎనిమిదో అధ్యాయంలో రాష్ట్ర శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, తొమ్మిదో అధ్యాయంలో భవిష్యత్ సూచలను వివరిస్తూ నివేదికను రూపొందించారు.

వెబ్దునియా పై చదవండి