శ్రీకృష్ణ కమిటీతో పనిలేకుండా తెలంగాణ ఇవ్వాలి: కేటీఆర్

గురువారం, 6 జనవరి 2011 (12:34 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీతో ఏమాత్రం సంబంధం లేకుండా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.తారక రామారావు వెల్లడించారు. గురువారం వెలుగు చూసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ నివేదికతో ఎలాంటి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం విజ్ఞతో కూడిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.

ఇందుకోసం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలన్నారు. ప్రధానంగా, గత యేడాది డిసెంబర్ తొమ్మిదో తేదీ చేసిన ప్రకటనకు కట్టుబడి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అంతేకాకుండా, కమిటీ నివేదిక పేరుతో కాలయాపన చేయరాదని, అసలు ఈ కమిటీ నివేదికతో తెలంగాణ రాదని తాము ముందే చెప్పామన్నారు.

వెబ్దునియా పై చదవండి