వైఎస్ఆర్ పార్టీతో కాంగ్రెస్ పునాదులు గల్లంతే: వెంకయ్య

కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన తండ్రిపేరు మీద స్థాపించనున్న వైఎస్ఆర్ పార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులు కూలిపోవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆయన సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మార్చి-ఏప్రిల్ నెలల్లో కేంద్ర రాష్ట్రాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయన్నారు.

జగన్‌ కొత్త పార్టీతో కాంగ్రెస్ పునాదులు కదులుతాయన్నారు. అందువల్ల మార్చి తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకవైపు జగన్ వ్యవహారం, మరోవైరు తెలంగాణ సమస్య, మరోవైపు అవినీతితో కాంగ్రెస్ పార్టీ పతనాన్ని శాసిస్తున్నాయన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలన్నారు.

జస్టీస్ శ్రీకృష్ణ నివేదికకు చట్టబద్ధత లేదని, అందువల్ల నివేదికతో సంబంధంద లేకుండా తెలంగాణ నిర్ణయం తీసుకోవాలన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక దండుగ అని, ఏ ప్రాంతాల వారు ఎలా కావాలంటే అలా నివేదిక ఇచ్చిందని వెంకయ్యనాయుడు అన్నారు.

వెబ్దునియా పై చదవండి