రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన పడిన మాట వాస్తవమే: కేకే

శనివారం, 15 జనవరి 2011 (16:55 IST)
రాష్ట్రంలో కాంగ్రెస్ కొద్దిగా బలహీన పడిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు.

ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉండే నేతలంతా పార్టీ కట్టుబాట్లకు లోబడి నడుచుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము ప్రజల ఆకాంక్ష మేరకే పాల్గొన్నట్టు చెప్పారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మినహా మరో మార్గం లేదని ఆయన చెప్పారు. అందువల్ల జార్ఖండ్ తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాము యూపీఏ సర్కారును కోరుతున్నట్టు కేకే తెలిపారు.

వెబ్దునియా పై చదవండి