అనవసరంగా గవర్నర్‌ను ఎందుకు లాగుతున్నారు: రాయపాటి

సోమవారం, 17 జనవరి 2011 (16:29 IST)
కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. అనవసరంగా తెలంగాణా అంశంపై రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్‌ను లాగుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతుందనీ, ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని కోరుకునే రాష్ట్ర ప్రధమ పౌరుడైన నరసింహన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణా ప్రాంత నాయకులు మానుకోవాలని హితవు చెప్పారు.

ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ... గవర్నర్ సీమాంధ్ర నాయకులకు మద్దతుగా నిలుస్తున్నారనడం పూర్తిగా తెలివితక్కువతనమన్నారు. గవర్నర్‌గా ఆయన విధులను ఆయన నిర్వర్తిస్తారని, ఇందులో ఎవరు కొమ్ము కాయాల్సిన అవసరం ఆయనకు లేదని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి