తెలంగాణవాదులు నాలుకలు చీల్చేస్తారు: హరీష్ రావు

FILE
టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే తెలంగాణ వాదులు వారి నాలుకలు చీల్చేస్తారని హరీష్ రావు తెలిపారు. ఇది కేంద్ర మంత్రి చిరంజీవికి కూడా వర్తిస్తుందని హరీష్ రావు అన్నారు.

ఇంకా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే సీమాంధ్ర ప్రాంతాన్ని ఎడారి చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుని హైదరాబాద్‌ను యూటీ చేస్తే కృష్ణా డెల్టాకు నీరు ఎక్కడ నుంచి.. ఎవరు ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి