కేసీఆర్ అండ్ కో ఢిల్లీ టూర్ : ఆహార భద్రతా బిల్లుకు ఓటు

సోమవారం, 26 ఆగస్టు 2013 (10:58 IST)
File
FILE
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఆయన అనుచరులు ఢిల్లీ బాటపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఆహార భద్రతా బిల్లుకు మద్దతుగా ఓటు వేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి మేరకు కేసీఆర్ ఆదివారం సాయంత్రమే తన అనుచరగణంతో హస్తినకు చేరుకున్నారు.

అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఎంపీలు మందా జగన్నాథం, జి. వివేక్‌లు కూడా ఢిల్లీకి వెళ్ళారు. వీరు కూడా ఆహార భద్రతా బిల్లుకు మద్దతు ఇవ్వనున్నారు.

కేసీఆర్ చేపట్టిన ఈ ఢిల్లీ పర్యటనలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా కాంగ్రెస్‌ పెద్దలతోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేశాక కేసీఆర్ తొలిసారి ఢిల్లీకి వెళ్లడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

వెబ్దునియా పై చదవండి