బాబు బుజ్జగింపుతో తగ్గిన పవన్... టిడిపి పొత్తు, పొట్లూరికి బిజెపి టిక్కెట్

గురువారం, 17 ఏప్రియల్ 2014 (19:57 IST)
WD
తెదేపా పితలాటకంతో విజయవాడ టిక్కెట్ గొడవపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలు 2014లో 7 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే నామినేషన్ గడువుకు మరో ఒక్కరోజు మాత్రమే ఉంది. ఈ దశలో పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు మంతనాలు సాగించారనీ, దాంతో పవర్ స్టార్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. గురువారంనాడు పొట్లూరి వర ప్రసాద్ కు నచ్చజెప్పినట్లు సమాచారం. ఐతే ఆయన బిజెపి నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు.

మరోవైపు పొట్లూరి పోటీ అంశంపై పవన్ కళ్యాణ్ గురువారం రాత్రిలోగా ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పొట్లూరి జనసేన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేయించాలా? లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించాలా? అనే అంశంపైనే పవన్ కళ్యాణ్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు... జనసేన అధినేత పవన్‌తో పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ గురువారం జరిపిన భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా హైదరాబాదులోని పవన్ నివాసంలో వీరి సమావేశం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న పీవీపీ రెండు రోజుల నుంచి ఈ విషయంపై చర్చిస్తున్నారు. అయితే, ఈ అంశంపై పవన్ సాయంత్రం ఓ స్పష్టమైన ప్రకటన చేయనున్నారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి