దాడి కేసులో పెద్దాపురం ఎమ్మెల్యే గాంధీ మోహన్ అరెస్టు!!

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (12:37 IST)
File
FILE
సామర్లకోట మాజీ జెడ్పీటీసీ సత్తిబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో పెద్దపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాకినాడ - సామర్లకోట మధ్య చెక్పోస్ట్ వద్ద ఈ అరెస్ట్ చేశారు.

సామర్లకోట మాజీ జెడ్పీటీసీ సత్తిబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో గాంధీ మోహన్ కోర్టు విచారణకు హాజరుకాలేదు. న్యాయస్థానం గాంధీమోహన్‌కు అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. దాంతో పోలీసులు గాంధీ మోహన్‌ను అరెస్ట్ చేశారు.

2012లో కూడా గాంధీ మోహన్‌పై కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2005లో అధికారులను నిర్బంధించిన కేసులో ఆ వారెంట్‌ జారీ అయింది.

వెబ్దునియా పై చదవండి