తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థి ఆర్. కృష్ణయ్య : చంద్రబాబు

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (16:09 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం ఆదిలాబాద్‌లో జరిగిన టీడీపీ ఎన్నికల బహిరంగ సభలో కృష్ణయ్య పేరును అధికారికంగా ప్రకటించారు. బీసీ సంక్షేమం కోసం కృష్ణయ్య గత 40 యేళ్లుగా పాటుపడుతున్నారని తెలిపారు.

తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని చంద్రబాబు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీ నేత అయిన ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బాబు ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో కృష్ణయ్య ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి