తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని నేనే : వీహెచ్ వెల్లడి

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (17:04 IST)
File
FILE
తనకు అన్నీ కలిసి వస్తే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని తానేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, అంబర్ పేట కాంగ్రెస్ అభ్యర్థి వి. హనుమంతరావు ప్రకటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తాను ముఖ్యమంత్రిని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

అదృష్టం కలిసొస్తే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిని బీసీ లేదా ఎస్సీలకే ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు సంధించిన బీసీ బాణానికి ఓట్లు రాలవని ఆయన కొట్టిపారేశారు.

వెబ్దునియా పై చదవండి