పవన్ కళ్యాణ్ ప్రచారం పవన్‌దే... నాది నాదే : చిరంజీవి

గురువారం, 24 ఏప్రియల్ 2014 (15:36 IST)
File
FILE
తన సోదరుడు, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంపై కేంద్రమంత్రి, సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి స్పందించారు. పవన్ ప్రచారం పవన్ దే, నా ప్రచారం నాదేనని స్పష్టం చేశారు. తాను ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు.

తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించనని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మోడీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు.

మోడీ వ్యాఖ్యలను బీజేపీలోని మహిళా కార్యకర్తలు కూడా స్వాగతించరని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ జీవనదిలాంటిదని... కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఎవరి తరం కాదని చెప్పారు. అలాగే, జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఎపుడూ కూడా ప్రజలకు మేలు చేయదని ఆయన హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి