మళ్ళీ కంపించిన హైతీ రాజధాని

ఆదివారం, 17 జనవరి 2010 (10:55 IST)
గత కొద్ది రోజులుగా భూకంపంతో దద్దరిల్లుతున్న హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ శనివారం కూడా మళ్ళీ భూమి కంపించింది. శనివారం భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 4.5గా నమోదైనట్లు అమెరికా భూ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అమెరికాకు చెందిన భూ శాస్త్రవేత్తల సర్వే ప్రకారం భూ ప్రకంపనలు 10 కిలోమీటర్ల లోతులో భూమి అంతర్భాగంలో సంభవించింది. ఇది హైతీ రాజధాని నుంచి 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు.

హైతీ ప్రాంతంలో మంగళవారం సంభవించిన భూకంపంతో ఆ దేశంలో దాదాపు రెండు లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయివుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కోన్ని లక్షల మంది తీవ్ర గాయాలపాలైనట్లు తమకు సమాచారం అందిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

తీవ్రంగా గాయాలపాలైన వారికి తక్షణమే చికిత్స చేయిస్తున్నామని, అలాగే లక్షల మంది నిరాశ్రయులైనారని, వీరికి కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు దేశవిదేశాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చి సహాయ సహకారాలను అందిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి