ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధం ఆపాలి: హాల్‌బ్రూక్ చివరి మాటలు

ఆఫ్-పాక్‌ల అమెరికా ప్రత్యేక రాయబారి రిచర్డ్ హాల్‌బ్రూక్ తనచివరి క్షణాల్లో కూడా పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్‌ల గురించే ఆందోళన చెందాడు. జార్జి వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఆసుపత్రిలో వైద్యులు హాల్‌బ్రూక్‌ని ఆపరేషన్‌ టేబుల్‌ మీదకి తీసుకుని వెళుతుండగా ఆఫ్ఘన్‌ యుద్ధానికి తెరదించడం వంటి తక్షణ సమస్యలు అనేకం తాను చూడాల్సి ఉందని హాల్‌బ్రూక్‌ అన్నారు.

అమెరికన్‌ ట్రబుల్‌ షూటర్‌‌గా పేరుగాంచిన రిచర్డ్‌ హాల్‌బ్రూక్‌ తన చివరి క్షణాల్లో అన్న మాటలు వింటుంటే.. ఈ ప్రాంతాలలో తీవ్రవాద నిర్మూలణకు వీలుగా తాను రూపొందించిన విధానాల అమలుకు ఆయన చేసిన అవిశ్రాంత కృషిని ప్రతిభింభింపచేస్తున్నాయి.

గత శుక్రవారం అనారోగ్యం కారణంగా హాల్‌బ్రూక్ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం చికిత్స చేస్తుండగా ఆయన మరణించారు. చికిత్స సమయంలో హాల్‌బ్రూక్‌ దృష్టి మళ్ళించేందుకు వైద్యులు ఆయనకు ఆందోళన కలిగిస్తున్న విషయాలను చర్చించారు. వాటిలో ఆఫ్ఘన్‌-పాక్‌ బాధ్యత గురించే ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి పిజె క్రౌలీ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి