84 ఏళ్ల వయస్సులోనూ పెళ్లికి రెడీ అంటున్న ప్లేబాయ్ తాత

సోమవారం, 27 డిశెంబరు 2010 (11:45 IST)
పెద్దవాళ్లకు మాత్రమే అంటూ శృంగారభరిత కధాకథనాలను ప్రచురించే 'ప్లేబాయ్' మాసపత్రిక వ్యవస్థాపకుడు హాగ్ హెఫ్నర్ ఆ పత్రికకు 2009 ప్లేమేట్‌గా ఎన్నికైన యువతిపై కన్నేశాడు. ఈ 84 ఏళ్ల తాత తన కన్నా 60 ఏళ్లు చిన్నదైన క్రిస్టల్ హ్యారీస్ (24 ఏళ్లు)ను వివాహమాడటానికి సిద్ధమయ్యాడు.

అంతే కాదండోయ్.. వీరిద్దరికీ నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. "సినిమా చూశాక క్రిస్టల్ మరియు నేను కానుకలను ఇచ్చిపుచ్చుకున్నాం. క్రిస్టల్‌కు ఓ ఉంగరాన్ని ఇచ్చాను. ఇదో నిజమైన, గుర్తుండిపోయే క్రిస్టమస్ వేడుక" అని హాగ్ తన ట్విట్టర్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. "క్రిస్టల్‌కు ఆ రింగ్ ఇచ్చిన తర్వాత, ఆమె కళ్ల వెంట ఆనందభాష్పాలు వచ్చాయి. నా జీవితంలో ఇదో అనందకరమైన క్రిస్టమస్" అంటూ సంతోషంలో మునిగిపోయారు సదరు మసలి రసిక శిఖామణి.

ఆ తర్వాతి ట్వీట్‌లో తన నిశ్చితార్ధ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ.. "ఆ ఉంగరం నిశ్చితార్ధపు ఉంగరమే.. ఇందులో రహస్యం కానీ.. సందేహం కానీ లేదు. అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు" అని పోస్ట్ చేశారు. కాగా.. హాగ్‌కు ఇది మూడవ వివాహం. గత 2009లో అతని రెండవ భార్య, మాజీ ప్లేమేట్ కింబెర్లీ కోన్రాడ్‌తో విడాకుల కోసం ధరఖాస్తు చేశాడు. కోన్రాడ్‌ను 1998లో హాగ్ వివాహం చేసుకున్నాడు. ఇకపోతే మొదటి భార్య మిల్డ్‌రెడ్ విలియమ్స్‌ నుండి 1959లో వేరుపడ్డాడు. ఇదిలా ఉండగా.. హాగ్ మరో ఇద్దరు స్త్రీలతో డేటింగ్ చేస్తూనే.. క్రిస్టల్‌తో ప్రేమాయణం సాగించాడు.

వెబ్దునియా పై చదవండి