ఆప్ఘనిస్థాన్‌‌లో మాదకద్రవ్యాల తరలింపు ముఠా అరెస్టు!!

ఆప్ఘనిస్థాన్‌లో మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న 54 మందితో కూడిన ముఠాను ఆ దేశ మాదకద్రవ్య నిర్మూలనా ముఠా అరెస్టు చేసింది. వారి నుంచి 700 కేజీలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 54 మందిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.

ఈ అంశంపై ఆప్ఘనిస్థాన్‌ హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆప్ఘనిస్థాన్ మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేసే కేంద్రంగా ఉంది. దక్షిణ ప్రాంతమైన హెల్మాండ్సిల్‌లోనే ఎక్కువగా గంజాయి పంటను ఎక్కువగా సాగుబడి చేస్తున్నట్టు తెలిపింది.

ఈ సాగు పంటను ధ్వంసం చేసేందుకు మాదకద్రవ్య నిర్మూలనా విభాగం గత వారం రోజులుగా ఆకస్మిక దాడులు చేస్తూ గంజా సాగును ధ్వంసం చేస్తోంది. అంతేకాకుండా, అనుమానాస్పద ప్రాతాల్లో తనిఖీలు చేస్తూ మాదకద్రవ్యాలను విక్రయించే సభ్యులను అరెస్టు చేసింది.

ఇలా మొత్తం 54 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా, పప్బి, హెరాయిన్, హాసిసిస్ అనే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మాదకద్రవ్యాల్లో ఒక్క ఆప్ఘనిస్థాన్‌లోనే 90 శాతం మేరకు ఆప్ఘనిస్థాన్‌లో ఉన్న 20 రాష్ట్రాల్లో సాగుబడి చేస్తున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి