ఆస్ట్రేలియాలో విదేశాంగ మంత్రి కృష్ణకు చేదు అనుభవం!

మూడు రోజుల అధికారిక పర్యటన కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. కామన్వెల్త్ క్రీడా నిర్మాణాలు, ఏర్పాట్లలో పాలు పంచుకున్న ఆస్ట్రేలియా కంపెనీలకు నిధులు చెల్లించలేదని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కృష్ణను నిలదీచింది. ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఆసీస్ విదేశాంగ మంత్రి కెవిన్ రుఢ్‌తో కృష్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ బిల్లు చెల్లింపుల వ్యవహారాన్ని రుఢ్ లేవనెత్తారు.

న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పలు ఆస్ట్రేలియా కంపెనీలు వివిధ పనులు పూర్తి చేశాయి. అయితే, వీటికి బిల్లులు చెల్లించే వచ్చే సమయానికి క్రీడల నిర్వహణ కమిటీ ఛైర్మన్ సురేష్ కల్మాడీ అధికారాలకు కేంద్రం కత్తెర వేసింది. ఫలితంగా పలు కంపెనీలకు చెల్లింపులు స్తంభించిపోయాయి. దీనిపై ఆస్ట్రేలియా కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, న్యాయ పోరాటానికి కూడా సిద్ధమయ్యాయి.

ఇంతలో విదేశాంగ మంత్రి కృష్ణ ఆస్ట్రేలియాకు వెళ్లడంతో ఆయనను నిలదీశారు. బిల్లుల చెల్లించలేదనే అంశం తన దృష్టికి తీసుకొచ్చారని, తాను ఢిల్లీకి చేరుకున్న తర్వాత కేంద్ర క్రీడామంత్విత్వ శాఖను సంప్రదించి సమస్యకు పరిష్కారం కనుగొంటామని రుఢ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణ హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి