పదకొండు సంపుటాలుగా హిందూ విజ్ఞాన సర్వస్వం

FILE
దాదాపు పాతికేళ్లపాటు వెయ్యిమంది మేధావులు తమ అనుభవాన్ని, విజ్ఞానాన్ని పరిశోధనా పటిమను రంగరించి హిందూయిజం సమగ్ర స్వరూపంగా ఓ విజ్ఞాన సర్వస్వాన్ని సోమవారంనాడు ఆవిష్కరిస్తున్నారు.

పాతికేళ్లపాటు హిందూయిజానికి సంబంధించిన అతి చిన్న అంశాలను సేకరించి, పరిశీలించి ఈ హిందూ విజ్ఞాన సర్వస్వంలో చేకూర్చారు. మొత్తం 11 సంపుటాలుగా వెలువడే ఈ విజ్ఞాన సర్వస్వం హిందూ ఆచారాలు, మతాలు, ఆధ్యాత్మిక భావనలు, తాత్త్విక చింతన తదితర అన్ని విషయాలను క్లుప్తంగా ఆవిష్కరిస్తుంది.

ఒక్కొక్క సంపుటిలో 600 నుంచి 700 పేజీలు ఉంటాయి. ప్రారంభంగా మూడువేల కాపీలను ప్రచురిస్తారు. ఇందులో దాదాపు భారత చరిత్ర, నాగరికత, భాష, కళలు, సంగీతం, నృత్యం, వైద్యం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, సామాజిక సంస్థలు, నిర్మాణ వైశిష్ట్యం తదితర అనేక అంశాలపై ఏడువేలకు పైగా స్పష్టమైన, నిర్దిష్టమైన వ్యాసాలను ప్రచురిస్తున్నారు. అలాగే హిందూ మహిళ ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కూడా భిన్న కోణంలో ఆవిష్కరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి