సిరియాపై దాడికి సిద్ధమవుతున్న అమెరికా - బ్రిటన్

మంగళవారం, 27 ఆగస్టు 2013 (10:39 IST)
File
FILE
రసాయన దాడి చేసి ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన సిరియాపై సైనిక దాడి చేసేందుకు అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ దిశగా ఉభయ దేశాలు కలిసి అడుగులు వేస్తున్నాయి.

గత ఏడాది కాలంగా ఇతర అవకాశాలు, మార్గాలు అన్నీ విఫలమైనందువల్ల ఇక సిరియా వ్యవహారంలో జోక్యం చేసుకుని దాడి చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి విలియం హేగ్‌ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

సైనిక చర్యకు సంబంధించిన అవకాశాలపై అమెరికా, ఇతర మిత్రపక్షాల సైనిక చీఫ్‌లతో బ్రిటన్‌ రక్షణ చీఫ్‌ చర్చించనున్నారు. కాగా సైనిక చర్యకు అనుమతినిచ్చే ఏ ప్రతిపాదననైనా సరే రష్యా, చైనా వీటో చేయనున్నాయి. అయితే ఐరాస ఆమోదం లేకపోయినా కూడా సైనిక చర్య అనేది అంతర్జాతీయ చట్టాల ప్రకారం చట్టబద్ధమైనదే అని హేగ్‌ వాదిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి