కొండెక్కిన ఉపాధి హామీ పథకం

FileFILE
యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మానస పుత్రికల్లో ఒకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గ్రామీణ ప్రాంత వాసులకు ఏడాదిలో వంద రోజుల పాటు ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం అమలులో పలు రాష్ట్రాలు పూర్తి అశ్రద్ధ చూపిస్తున్నాయి.

పథకం అమలులో అశ్రద్ధ, నిధుల దుర్వినియోగం భారీగా జరుగుతున్నట్టు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా తన నివేదికలో బహిర్గతం చేశారు. ముఖ్యంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే ఎక్కువగా నీరుగార్చుతున్నట్టు పేర్కొన్నారు. బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పథకం పూర్తిగా నీరుగారిపోయింది.

కానీ, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాల్లో పథకం భేషుగ్గా అమలవుతున్నట్టు వెల్లడించారు. వీటికి తోడు.. నిధుల దుర్వినియోగం భారీ స్థాయిలో జరుగుతున్నట్టు సింగ్ తన నివేదికలో వెల్లడించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి