ప్రధాని పదవి ఇప్పుడే వద్దు: రాహుల్ గాంధీ

ప్రధాని పదవిని ఇవ్వజూపితే తాను నిరాకరిస్తానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ శనివారం కోలకతాలో విలేఖరులకు చెప్పారు. అత్యున్నతమైన పదవికి కావలసిన అనుభవం తనకు ఇంకా రాలేదని ఆయన తెలిపారు.

సమీప భవిష్యత్తులో ప్రదాని పదవిని స్వీకరిస్తారా అని విలేకరుల ప్రశ్నించినప్పుడు ప్రస్తుతానికైతే నేను తిరస్కరిస్తానని రాహుల్ సమాధానమిచ్చారు. ఇప్పటికిప్పుడు దేశ ప్రధాని పదవిని అధిష్ఠించడానికి నాకు అనుభవం ఉందని నేను అనుకోవడం లేదని 39 సంవత్సరాల రాహుల్ చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీని పేదలకు అనుకూలమైన, దృఢమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తున్నానని, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో ఈ విషయంలో చేసిన కృషి ఫలించిందని ఆయన చెప్పారు.

సుమారు గంట సేపు సాగిన ఈ విలేకరుల సమావేశంలో రాహుల్ పక్కనే విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నారు. శ్రీలంకలో పరిస్థితి నుంచి పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం పని తీరు బాగోలేదని రాహుల్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి