అదంతా "మార్ఫింగ్" మాయ: నిత్య"ఆనంద" వేదన

గత వారం రోజులుగా నిత్యానంద- రంజిత సెక్స్ వీడియోలతో మీడియా హోరెత్తించింది. నిత్యానంద మాత్రం ఆ వీడియోలో కన్పించింది తానైనప్పటికీ మార్ఫింగ్ మాయతో ఉన్నది లేనట్లుగా చూపించారని ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌తో చెప్పుకొచ్చారు.

తనకున్న పేరు ప్రఖ్యాతులను మంట గలిపేందుకు కొందరు పనిగట్టుకుని ఇలాంటి వీడియోలను సృష్టించారన్నారు. దీని వెనుక మోసం, కుట్ర... అన్నీ దాగున్నాయన్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా వెనకా ముందు చూడకుండా ఆ వీడియోలను ప్రదర్శించి తన పరువును బజారుకీడ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం ఒకప్రక్కన జరుగుతుండగానే దేశంలో ఆయా ప్రాంతాలలో ఉన్న ఆశ్రమాలలో ఎనిమిదింటిపై దాడి చేసి ధ్వంసం చేశారన్నారు. తనకు శత్రువులెవరూ లేరని అనుకునే వాడిననీ, కానీ గత వారం రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే, అది నిజమేనేమోనన్న అనుమానం కలుగుతుందని చెప్పారు.

తనకు ఆధ్యాత్మిక రంగం తప్పించి మరో లోకం లేదనీ, ఇప్పటివరకూ సుమారు 200 పుస్తకాలకు పైగా రాశానన్నారు. వాటిలో తాత్విక, శాస్త్రీయ కోణాలను ఆవిష్కరించే పుస్తకాలున్నాయన్నారు.

వెబ్దునియా పై చదవండి