మావోయిస్టు అగ్రనేత కాంచన్‌తో సహా ఐదుగురు అరెస్ట్

మావోయిస్టలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల వలలో మరో మావోయిస్టు అగ్రనేత చిక్కాడు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాకు సమీపంలో, మెట్రోపాలిస్‌లలో పోలీసులు సోదాలు నిర్వహించగా.. మావోల అగ్రనేత కాంచన్ అలియాస్ సుదీప్ చాంగ్డర్‌తో మరో నలుగురులు మావోలను పోలీసులు అరెస్టు చేశారు.

సిల్దాలోని ఈఎఫ్ఆర్‌ క్యాంప్‌పై దాడిలో పాల్గొన్న మరో మావోయిస్టుని పశ్చిమ మిద్నాపూర్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. కాంచన్ ఆలియాస్ సుదీప్ చాంగ్డర్ 2008లో లాల్‌ఘడ్ ఉద్యామానికి వ్యూహరచన చేసిన వారిలో కీలక వ్యక్తి.

అంతే కాకుండా.. ఇతను సెంటర్ కమిటీ సభ్యుడు కూడా. మెట్రోపాలిస్‌లో మైదాన్ ప్రాంతంలో ప్రత్యేత టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎప్) పోలీసులు కిషణ్‌జీ అనే మావోల అగ్రనేతను అరెస్టు చేసిన 24 గంటల్లోనే మరో మావోయిస్టు నేతను అరెస్టు చేసినట్లు ఎస్‌టిఎప్ ఛీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు.

కాంచన్ మావోలకు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవరించేవాడు. ఫిబ్రవరి 2008లో నార్త్ 24 పార్గనాస్‌లోని రైల్వే స్టేషన్‌లో సోమెన్ అలియాస్ హిమాద్రి సేన్ రాయ్‌ను అరెస్టు చేసిన అనంతరం కాంచన్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు.

వెబ్దునియా పై చదవండి