అవినీతి వ్యతిరేక పోరాటం: డిసెంబర్ 22న భారీ ర్యాలీ

అవినీతిపై పోరాడేందుకు ఎన్డీఏ నడుంబిగించింది. గత కొద్ది రోజులుగా 2 స్పెక్ట్రమ్ కుంభకోణంపై జెపిసి డిమాండును కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చడంపై ఎన్డీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎన్డీఏతో విపక్షాలు ముక్తఖంటంతో యూపీఏ సర్కాను, పార్లమెటును స్థంభింపచేస్తున్నాయి.

పార్లమెంటు సమావేశాలు కూడా ముగినున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అవినీతి విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 22న అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఎన్డీఏ భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించనుంది.

"ఇది ఎన్డీఏ ర్యాలీ కాదు. ఇది మొత్తం విపక్షాల ర్యాలీ. డిసెంబర్ 22న ఢిల్లీలో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తాం. దేశంలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయ"ని జెడి-యు ఛీఫ్ శరద్ యాదవ్ తెలిపారు.

అయితే ఈ ర్యాలీలో లెఫ్ట్ పాల్గొంటుందా అన్ని ప్రశ్నను ఆయన దాటవేస్తూ.. "ఆ రోజు ఈ సమస్యపై పోరాండేకు అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతాయ"ని బదులిచ్చారు. ధరల పెరుగుదలపై గత జులై 5న అన్ని విపక్ష పార్టీలు కలిసి భారత్ బంధ్‌కు పిలుపునిచ్చినట్లుగానే ఈ ర్యాలీ కూడా జరుగుతుందని ఎన్డీఏ ఆశాభావంతో ఉంది.

వెబ్దునియా పై చదవండి