వారణాసిలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో దాయాది దేశమైన పాకిస్థాన్‌కు హస్తమున్నట్లు ప్రాథమిక విచారణలో తెలియవచ్చింది. వారణాసి పేలుళ్ల ఉపయోగించిన పేలుడు పదార్థాలను పాకిస్థాన్ సైన్యం వినియోగించేవని విచారణలో బయటపడింది. గుజరాత్ తీవ్రవాద నిరోధక విభాగం జరిపిన విచారణలో వారణాసి పేలుళ్లకు ఉపయోగించిన పదార్థాలు, పాకిస్థాన్ సైన్యం వినియోగించేదని ఫోరెన్సిక్ పరిశోధనలో తేలింది.
ఇంకా ఫోరెన్సిక్ పరిశోధనలో పాకిస్థాన్ ఉపయోగించే కార్బన్, వారణాసిలో వినియోగించిన కార్బన్ మ్యాచ్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా.. వారణాసిలో గత ఏడో తేదీ జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందడంతో పాటు ఏడుగురు విదేశీ పర్యాటకులతో పాటు 37 మంది గాయపడ్డారు.