2జి స్పెక్ట్రమ్ స్కామ్: తమిళ పత్రికాఫీసులో సీబీఐ సోదాలు

బుధవారం, 15 డిశెంబరు 2010 (11:20 IST)
2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి ఒక తమిళ మ్యాగజైన్ కార్యాలయంలో సీబీఐ దాడులు నిర్వహించింది. టెలికామ్ శాఖ మాజీ మంత్రి ఏ.రాజాకు అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు భావించడంలో చెన్నయ్‌లో ఆ పత్రిక కార్యాలం, జర్నలిస్టు నివాసం, రాజా బంధువులు ఇళ్ళపై కూడా సీబీఐ బుధవారం సోదాలు నిర్వహించింది. వీటితో పాటు.. కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా, ట్రాయ్ మాజీ ఛైర్మన్ ప్రదీప్ బైజాల్ తదితర ఇళ్ళలో కూడా సీబీఐ దాడులు నిర్వహించింది.

టెలికామ్ మంత్రి ఏ.రాజా నివాసంలో దాడి చేసిన వారం రోజుల తర్వాత సీబీఐ ఈ తరహా దాడులకు పాల్పడటం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం 27 ప్రాంతాల్లో 150 మంది అధికారులు ఏకకాలంలో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అలాగే ఢిల్లీలో ఏడు ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి.

ఇందులో రాజా, రాడియా, బైజాల్‌లకు ఆడిటర్, అకౌంటెంట్ కార్యాలాయాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా, నీరా రాడియాకు చెందిన వైష్ణవీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, దక్షిణ ఢిల్లీలోని ఆమె ఫామ్‌హౌస్‌లు ప్రధానంగా తనిఖీ చేసిన ప్రాంతాలుగా ఉన్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

అంతేకాకుండా, నిధుల తరలింపు వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రాజాకు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లపై కూడా తనిఖీలు చేసినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో 1.76 లక్షల కోట్ల రూపాయల మేరకు కుంభకోణం చోటు చేసుకున్నట్టు సమాచారు.

వెబ్దునియా పై చదవండి