యూపీఏపై నిప్పులు చెరిగిన రైల్వే మంత్రి మమతా బెనర్జీ!
యూపీఏ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ విమర్శల వర్షం కురిపించారు. నిత్యావసరాలతో పాటు ఉల్లి ధర పెరగడానికి యూపీఏ ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని మమతా ధ్వజమెత్తారు. నిత్యావసర ధరల నియంత్రణపై యూపీఏ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం పట్ల మమతా మండిపడ్డారు.
ప్రస్తుతం ఉల్లి ధర ఆకాశాన్ని తాకుతోందని మమతా చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లికిలో 70 రూపాయల వరకు పలుకుతోందని, దీంతోపాటు పెరుగుతున్న నిత్యావసరాలపై తాము దృష్టి సారిస్తామని బెనర్జీ వెల్లడించారు. వివిధ అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు యుపీఏ భాగస్వామ్య పక్షాలతో సంప్రదించాల్సి ఉండగా, ఇటీవల పెట్రో ధరలపై తమను సంప్రదించకుండానే పెంచేశారని మమతా బెనర్జీ తెలిపారు.