దేశంలో అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం యువతకు పిలుపునిచ్చారు. దేశ రాజకీయాలకు కెమోథెరపీని నిర్వహించాలని ఆయన అన్నారు.
మహారాష్ట్రలోని అమరావతిలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దేశానికి నీతివంతమైన ప్రజలు, యువత అవసరమన్నారు. దీనివల్ల ప్రతి ఇంటిలో మంచి ప్రవర్తన, సామరస్యం నెలకొంటుందన్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
ముఖ్యంగా, విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతిపై సమరశంఖాన్ని ప్రతి ఒక్కరు తమ ఇంటి నుంచే పూరించాలని ఆయన యువతను కోరారు. తల్లిదండ్రులు అవినీతికి పాల్పడకుండా పౌరులే చూడాలని, అపుడే అవినీతి రహిత భారత్‌ను చూడగలుగుతామన్నారు.