షష్టిపూర్తి చేనుకున్న 'సంతానం'

బుధవారం, 5 ఆగస్టు 2015 (14:06 IST)
సాధనా పతాకంపై నిర్మాత రంగనాధదాస్‌ నిర్మించిన మొదటి చిత్రం సంసారం, ఇక అసలు కథకు వస్తే రంగయ్య అనే మిల్లు కార్మికుడికి లక్ష్మి, రాము, బాబు అనే ముగ్గురు సంతానం. ఒక దురదృష్ట సంఘటనలో కళ్ళు కోల్పోతాడు రంగయ్య. అతడి (ఎస్‌వి.రంగరావు) సంతానం ముగ్గురూ లక్ష్మి (శ్రీరంజిని) రాము (అక్కినేని నాగేశ్వరరావు) బాబు (చలం) కలసి జీవనయానం సాగించి విధివశాత్తూ బాల్యదశలోనే విడిపోతారు. ఈ విడిపోక ముందు అక్క లక్ష్మి చిన్నతమ్ముణ్ణి నిద్రపుచ్చుతూ నిదురపోరా తమ్ముడా అని జోల పాడుతుంది. ఈ పాటే కథకు కీలకం. ఓ ఇరవై యేళ్ళు గడిచాక ఇదే పాట వారిని ఏకం చేస్తుంది. ఇదే ఫార్ములాతో హిందీలో యాదోంకీ బారాత్‌ వంటి ఎన్నో హిట్‌ చిత్రాలు రూపొందాయి.
 
పరిస్థితులు రీత్యా విడిపోయిన లక్ష్మి ఓ జమిందారు(మిక్కిలినేని) ఇంట వంటమనిషిగా చేరుతుంది. రాము నాటకాల కంపెనీలో చేరి వేషాలేస్తూ పెరిగి పెద్దవాడై, కృష్ణ వేషంలో ఓ జమిందారు(రేలంగి) ఇంట్లో ప్రవేశించి అతని కూతురు(సావిత్రి) అభిమానాన్ని, ప్రేమను పొందుతాడు. మూడోవాడైన బాబు ఓ వస్తాదు వద్ద పెరిగి మిక్కిలినేని కూతురు(కుసుమకుమారి)ని ప్రేమిస్తాడు. మిక్కిలినేనికి ఓ కొడుకు(అమర్‌నాధ్‌). అతను లక్ష్మిని ప్రేమిస్తాడు. ఇది నచ్చని పెద్దాయన కొడుకును  విదేశాలకు పంపించి అతను వెళ్లగానే లక్ష్మిని ఇంటి నుంచి గెంటివేస్తాడు. ఆ బాధతో లక్ష్మి పాడిన గీతం(చిన్నప్పటి గీతం)తో రాము అక్కను గుర్తిస్తాడు. వారిద్దరూ పతాక సన్నివేశంలో తమ్ముడు బాబును, తండ్రి రంగయ్యను కలుసుకుంటారు. ఆ విధంగా అంధుడైన తండ్రి రంగయ్య తన సంతానం ముగ్గుర్నీ కలుసుకోవడం, అపార్థాలు తొలగి ఆ ముగ్గురికీ వారు కోరుకున్నవారితో వివాహం జరగడంతో కథ సుఖాంతమౌతుంది.
 
సుప్రసిద్ద దర్శకుడు ఎల్‌.వి.ప్రసాద్‌ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షకులు. కనుక సెంటిమెంట్‌కు, హ్యాస్యానికి, ప్రేమకు తగినంత ప్రాధాన్యతతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దర్శక, నిర్మాత రంగనాథదాసు. అనిశెట్టి-పినిశెట్టి రచన చేసిన ఈ చిత్రంలో సుసర్ల దక్షిణామూర్తి స్వరరచనతో ఘంటసాల గానంతో పరవశింపచేసే రెండుపాటలున్నాయి. అవి దేవి-శ్రీదేవి ఒకటి కాగా, రెండోది చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో... హిందీ బాణీని అనుసరించి స్వరపరచిన మరో రెండు గీతాలు సంతోషమేలా సంగీతమేలా, మురళీగానమిదేనా. కాగా సంతానం చిత్రాన్ని ప్రేక్షకులు మరిచిపోలేకుండా చేసిన ఒకే ఒక అంశం ఈ చిత్రానికి అతా మంగేష్కర్‌ గానం చేసిన నిదుపోరా తమ్ముడా, అనేగీతం. చిత్రంలోని ద్వితీయార్ధంలో ఘంటసాల కూడా ఆమెతో గళం కలిపారు. ఏరువాకా పాట రోజులు మారాయని హిట్‌ చేస్తే, నిదుపోరా తమ్ముడా అనే గీతం అదే సంవత్సరం 5.8.1955 విడుదలైన సంతానం చిత్రాన్ని కలకాలం గుర్తిండిపోయేలా చేసింది.

వెబ్దునియా పై చదవండి