ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

ఠాగూర్

ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (11:05 IST)
ఇటీవలికాలంలో కొన్ని వన్యప్రాణులు జనసావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో సరైన ఆహారం దొరకకపోవడం, దప్పిక  తీర్చుకునేందుకు నీరు లేకపోవడంతో సమీప ప్రాంతాల్లోకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఎలుగుబంటి దారితప్పి గ్రామంలోకి వచ్చింది. దీంతో గ్రామస్థులంతా కలిసి దాన్ని బంధించి, చిత్ర హింసలకు గురిచేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటిని బంధించిన గ్రామస్థులు దానిపై దాడి చేశారు. దాని నోటిని విరిచేశారు. కాలి గోళ్లను తొలగించారు. అది నొప్పితో విలవిల్లాడజుతున్నప్పటికీ విడిచిపెట్టకుండా దారుణానికి పాల్పడ్డారు. గ్రామస్థులంతా పెట్టిన బాధను భరించలేని ఆ ఎలుగుబంటి చివరకు ప్రాణాలు విడిచింది. 
 
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అటవీశాఖ అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేసమయంలో ఎలుగుబంటిని చిత్రహింసలకు గురిచేసిన నిందితుల్లో కొందరిఫోటోలను విడుదల చేసింది. వారి ఆచూకీ తెలిసిన వారికి రూ.10 వేలు నజరానా ఇస్తామని ప్రకటించింది. ఎలుగుబంటి విషయంలో గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆర్సీ దుగ్గ వెల్లడించారు. అలాగే, ఎరుగుబంటిని చిత్రహింసలకు గురిచేసినవారిని పట్టుకుని తగిన విధంగా శిక్షిస్తామని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు