ఏప్రిల్ నెలలో జన్మించారా..!? ఐతే గర్వం ఎక్కువే..!?
మంగళవారం, 3 ఏప్రియల్ 2012 (15:16 IST)
FILE
ఏప్రిల్ నెలలో జన్మించారా..!? అయితే గర్వం ఎక్కువేనని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ నెలలో పుట్టిన జాతకులు అధికార గర్వముతోనూ, అహంకారంతో విర్రవీగుతారు. అందరినీ ద్వేషిస్తూ.. ఇతరుల పట్ల దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తారని వారు చెబుతున్నారు. ప్రపంచమంతా వీరి వల్లనే నడుస్తున్నట్లు వీరి మాటలుంటాయి.
ఏప్రిల్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జన్మించిన వారు మాత్రం గొప్పవారై కీర్తి ప్రతిష్టలను కలిగివుంటారు. వీరికి గొప్ప మనోబలం, పట్టుదల, పరాక్రమము, శూరత్వము కలిగి కుటుంబ సౌభాగ్యానికి పాటుపడతారు. ఆక్షేపణలు వీరికి నచ్చవు. స్వతంత్ర భావము అధికంగా కలిగివుండే వీరికి భార్య ద్వారా గానీ, సంతానము ద్వారా గానీ పేచీలు తప్పవు. ఏ విషయాన్నైనా నిర్భయము, నిర్మొహమాటంగా మాట్లాడం వీరి నైజం.
ఇక ఏప్రిల్ నెలలో పుట్టిన జాతకులు స్త్రీల మనోభావాలను గుర్తింపలేరు. స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలందు సుఖశాంతులు లోపిస్తవి. వీరికి 26వ సంవత్సరం దాటిన గానీ యోగదశ ప్రారంభింపదు. 36 సంవత్సరాల పైన అభివృద్ధి ఉంటుంది. కానీ 30, 33 మధ్య కాలంలో అనేక కష్టాలు తప్పవని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.