మీరు భరణి నక్షత్రములో జన్మించిన జాతకులైతే..!?

శనివారం, 28 ఏప్రియల్ 2012 (12:15 IST)
FILE
నక్షత్రాల్లో రెండోదైన భరణిలో జన్మించిన జాతకులు ఎంతటి సాహస కృత్యము చేయుటకైనను వెనుకాడరు. ఇతరుల ఉపదేశములుగాని, అభిప్రాయాలుగానీ స్వీకరించినప్పటికీ కొంత ఉద్దేశము, నిశ్చయము తన మనస్సులో లేకుండా వీరు ఏ పని చేయలేరు. ఈ నక్షత్ర జాతకులు సర్వవిషయము లందు పరిజ్ఞానము కలవారే.

అన్యాయమును ఎదిరించేందుకు వెనుకాడరు. జీవిత అవసానదశ వరకు శ్రమించుట వీరి లక్ష్యము. కర్మయోగమునందు వీరికి విశ్వాసము ఎక్కువ. ఉద్యోగమందు, వ్యవసాయమందు వీరు బాగా రాణిస్తారు. దాంపత్య జీవితము వీరికి బాగానే ఉంటుంది. కుటుంబ పాలన యందు సామర్థ్యముగల, సత్‌స్వభాముగల సతీమణి లభిస్తుంది.

భరణి 1వ పాదమందు జన్మించిన జాతకులు శత్రువులకు భయం కలుగజేస్తారు. శౌర్యం, పట్టుదల కలిగివుంటారు. ప్రారంభించిన పనిని పూర్తిచేయకుండా నిద్రపోరు. రెండో పాదములో జన్మించిన జాతకులు ఉత్సాహవంతంగా కనిపించకపోయినా సామర్థ్యం అధికంగా కలిగివుంటారు. బుద్ధిమంతులుగా, సర్వ ప్రీతిరకమైన గుణములు కలిగివుంటారు. ధర్మశీలులుగా ఉంటారు.

భరణి మూడో పాదములో జన్మించిన జాతకులు సన్నని పొడవు శరీరం కలవారుగా పెద్దకళ్లుకలవారుగా, బుద్ధిమంతులుగా ఉంటారు. వెంట వెంటనే కోప పడటం జరుగుతుంది. నాలుగో పాదమందు జన్మంచిన జాతకులకు మొండి పట్టుదల ఎక్కువ. గర్వం ఎక్కువ. భరణి నక్షత్రములో జన్మించిన జాతకులు రోహిణి, ఆరుద్ర, పుష్యమి, అనురాధ, జ్యేష్ట నక్షత్రములందు ఎలాంటి పని చేయరాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి