ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సాగవు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు.
సంతోషకరమైన వార్త వింటారు. ఒక వ్యవహారం మీ సమక్షంలో జరుగుతుంది. వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. పనులు సానుకూలమవుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పొదుపు ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పొగడ్తలకు పొంగిపోవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు సామాన్యం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.
లక్ష్యాన్ని సాధిస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు నియంత్రించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు చేరువవుతారు. పనులు పురమాయించవద్దు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు.
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావలసిన ధనం అందుతుంది. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు.
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పనులు పురమాయించవద్దు. రావలసిన ధనం అందుతుంది. ధనసహాయం తగదు. కీలక పత్రాల రెన్యువల్లో మార్పులు సాధ్యమవుతాయి.
ఆర్ధికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. రశీదులు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.