శ్రవణా నక్షత్రమా? ఐతే చేసిన సహాయాన్ని గొప్పగా చెప్పుకోరు!

FILE
చంద్రగ్రహ నక్షత్రమైన శ్రవణా నక్షత్రములో పుట్టిన జాతకులు తాము చేసిన సహాయాన్ని గొప్పగా చెప్పుకోవడం చేయరని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. బంధువులకు, స్నేహితులకు సహాయం చేసే ఈ జాతకులు ఒకరికి చేసిన సహాయాన్ని మరొకరికి చెప్పరు. బాల్యంలో నుంచే పేరు ప్రఖ్యాతలు, అవసరానికి తగిన ధనం చేతికందుతుంది. అడుగడుగునా దైవానుగ్రహం కాపాడుతుంది. దైవభక్తి, గుప్తదానాలవల్ల వైవాహిక జీవితం బాగుంటుంది. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది.

ఈ జాతకులకు ఇతరుల వద్ద చనువుగా మాట్లాడే స్వభావం ఉంటుంది. కానీ ఎవరినీ నెత్తికెక్కించుకోరు. ఎవరికి ఏ విధమైన మర్యాద ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఈ జాతకులను బాగా తెలుసు. అంతర్గత ఆలోచన, మేధస్సు ఇతరులకు ఏ మాత్రం అర్థం కారు. ఓర్పు, పట్టుదలతో అనుకున్న కార్యాన్ని దిగ్విజయం పూర్తి చేసే ఈ జాతకులకు ఆభరణాలు, విలువైన వస్తువులు స్థిరాస్తులు ప్రాప్తిస్తాయి. మనోధైర్యంతో నిబ్బరంతో సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో అంచెలంచెలుగా పైకి వస్తారు.

శ్రవణ నక్షత్రంలో పుట్టిన జాతకులకు 4, 8 అనే సంఖ్యలు అనుకూలిస్తాయి. అలాగే 5,6 అనే సంఖ్యలు సామాన్య ఫలితాలుంటాయి. అయితే 1, 2, 9 అనే సంఖ్య మాత్రం వీరికి కలిసిరావు. ఇంకా శనివారం ఈ జాతకులకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక రంగుల విషయానికొస్తే, నలుపు, నీలము రంగులు అదృష్టాన్నిస్తాయి. అందుచేత నలుపు లేదా నీలపు చేతిరుమాలును వాడటం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి