చాతుర్మాసం ప్రారంభంతో వివాహం, క్షవరం , గృహ ప్రవేశం మొదలైన పనులు నిలిచిపోతాయి. ఈ మాసంలో శివుని పూజిస్తారు.
ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి ప్రారంభం: జూలై 09, శనివారం, 04:39 సాయంత్రం
ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి ముగింపు: జూలై 10, ఆదివారం, మధ్యాహ్నం 02.13 గంటల వరకు
పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, పండ్లు, చందనం, అక్షత, తమలపాకులు, తులసి ఆకులు, పంచామృతం మొదలైన వాటిని విష్ణువుకు సమర్పించండి. ఈ సమయంలో, ఓం భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
ఆ తర్వాత విష్ణు చాలీసా, విష్ణు సహస్రనామం, దేవశయని ఏకాదశి ఉపవాస కథను పఠించండి. విష్ణువు హారతితో పూజను ముగించండి.
మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ చేయాలి. బ్రాహ్మణునికి అన్నం, వస్త్రాలు, దక్షిణ ఇవ్వాలి. ఆపై పారణ చేసి ఉపవాసాన్ని విరమించాలి.