శ్రీకృష్ణునికి బుధవారం అటుకుల అన్నం, బెల్లం, కొబ్బం తురుమువు వేసి నైవేద్యంగా పెడితే అప్పుల బాధ ఉండదు. ఈ ప్రసాదాన్ని తినే వారి ఇంట్లో భాగ్యం పెరుగుతుంది. ఇంట్లోని వారందరూ సుఖంగా వుంటారు. అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి ఆ గృహంలోని మహిళలు, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది.
తీపి అటుకుల అన్నాన్ని తేనెను అరటికాయను వేసి కలిపి శ్రీ పార్వతి పరమేశ్వరులకు నైవేద్యం పెట్టి వృద్ధ బ్రాహ్మణ దంపతులకు తాంబూలాన్ని దానంగా ఇచ్చి ఆవుకు ప్రసాదాన్ని పెట్టి పెళ్లికాని అబ్బాయి, అమ్మాయిలకు ఇస్తే త్వరగా వివాహం అయి సుఖమయ దాంపత్య జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.