ఈ శకునాలలో మనుష్యులు మాత్రమే కాకుండా కొన్ని జంతువులు, పక్షులు కూడా పేర్కొనబడుతున్నాయి. అలాగే కొన్ని రకాల ధ్వనులను కూడా శకునాలుగా భావిస్తుంటారు. ముత్తైదువులు నీళ్ల బిందెతో ఎదురైనా, ఆవుదూడలు ఎదురైనా, ఆలయంలో నుండి గంట మోగిన శబ్దం వినిపించినా శుభశకునాలుగా భావించాలని చెప్పబడుతోంది.