07-07-2023 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

శుక్రవారం, 7 జులై 2023 (05:00 IST)
మేషం :- చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
వృషభం :- పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. ముఖ్యులకు బహుమతులు అందచేస్తారు. గతంలోని వ్యక్తులు తారసపడతారు.
 
మిథునం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విద్యా సంస్థల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. బంధువుల ఆకస్మికరాకతో మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. గృహ మరమ్మతులు, నిర్మాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచయాలు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో ఆటంకాలను అధికమిస్తారు. ఉపాద్యాయులు విశ్రాంతి లభించదు.
 
సింహం :- వృత్తి పనులు కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. సోదరీ సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. మీరు ప్రేమించే వారి వల్ల కొంత నష్టపోయే ఆస్కారం ఉంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
కన్య :- బంధువుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కోర్టు వ్యవహరాలు వాయిదా వేయటం మంచిది. దూరప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. పీచు, ఫోము, లెదర్ వ్యాపారస్థులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
తుల :- నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా పూర్తి కాగలవు. అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య అనుబంధాలు బలపడతాయి.
 
ధనస్సు :- మీ సంతానం విషయంలో ఏకాగ్రత వహించగలుగుతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. పారిశ్రామిక రంగంలో వారికి ప్రతికూల వాతావరణం నెలకొని ఉంటుంది. ఒక ప్రకటన మీకెంతో ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం :- వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. మిత్రుల కలయికతో ప్రశాంతతను పొందుతారు. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి.
 
కుంభం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశలులభిస్తారు.
 
మీనం :- మీ అభిప్రాయాలు, భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. వాతావరణంలో మార్పుతో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పత్రిక, వార్తా మీడియా వారికి ఊహించని చికాకు లెదురవుతాయి. రావలసిన ధనంగురించి ఆలోచనలుచేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు