తొలి ఏకాదశి... పేలాల పిండి తినడంలో పరమార్థం ఏమిటి...?

శుక్రవారం, 15 జులై 2016 (13:55 IST)
తొలి ఏకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు వారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది. తొలి ఏకాదశి పండుగ నాడు అందరూ పేలాపిండి తినడం ఆచారం. ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు. కానీ ఈ పిండి విశేషం చాలా మందికి తెలియదు. పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు. 
 
పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల తొలి పండుగ దినాన వారిని గుర్తుచేసుకోవడం అనేది ఇందులో ఉన్న ప్రధాన అంశం. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. అంతకు మించి శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి