దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? భూతాలు ఉన్నాయని విశ్వసిస్తారా? పోనీ ఎప్పుడైనా దెయ్యాన్ని కళ్లారా చూశారా? దెయ్యాలు, భూతాలు ఏంటి బాస్, అంతా ట్రాష్ అంటారా! నిజానికి ఈ లోకంలో దెయ్యాలున్నాయని కొందరు, లేవని మరికొందరు అంటుంటారు. దెయ్యాలు ఉన్నాయో లేవో అన్నది వారి నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దెయ్యాలున్నాయన్న వాదన కొస్తే... అసలు దెయ్యాలు ఎక్కడ వుంటాయి అనేది ప్రతి యొక్కరి మదిలో మెదిలే ప్రశ్న. ఆ దెయ్యాలు ఎక్కడెక్కడ వుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పాతబడిన బంగ్లాలో జనసంచారం లేని చోట్లలో దెయ్యాలు ఉంటాయట. నిజానికి అలాంటి బంగ్లాలు చూడ్డానికి కూడా భయంకరంగానే ఉంటాయి. పూర్వం చింత చెట్ల మీద దెయ్యాలు తిష్ట వేస్తాయని పెద్దలు అంటారు. మరీ ముఖ్యంగా వేసవిలో చింత చెట్ల మీద దెయ్యాలు వుంటాయని, అందుకే మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి వేళల్లో అటు వైపు వెళ్లవద్దని అప్పట్లో మన పెద్దలు హెచ్చరించేవారు.