ఒక్క అపార్థం చేసుకోవడం వల్ల అందమైన విషయాలు విషంగా మారుతాయి

శనివారం, 10 సెప్టెంబరు 2022 (00:09 IST)
ఏ వస్తువు లేదా మనిషి సహాయం లేకుండా మనల్ని నాశనం చేసేది లేక దహించివేసేది మన కోపం మాత్రమే.
 
మంచి పూలతో తోట ఎలాగైతే రాణిస్తుందో మంచి ఆలోచనలతో మన జీవితం కూడా సుఖసంతోషాలతో రాణిస్తుంది.
 
పువ్వులు చేరే ప్రదేశాన్ని బట్టి ఎలాగైతే పూజింపబడుతున్నవో మనిషి కూడా తను ఎంచుకున్న సత్సంగం వల్ల గౌరవింపబడతాడు. 
 
అహం మానవత్వాన్ని మరుగునపెట్టి క్రూరత్వాన్ని రెచ్చగొడుతుంది.
 
మన జీవితంలో ఎంతోమందితో జరిగిన ఎన్నో అందమైన విషయాలు ఒక్క అపార్థం చేసుకోవడం వల్ల అందమైన విషయాలు విషంగా మారుతాయి.
 
జయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అపజయం ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు